

జనం న్యూస్ జనవరి 27 నారాయణపేట జిల్లా మద్దూర్ మండలం మద్దూరు: రాష్ట్ర ప్రభుత్వం కంట్రీ బ్యూటర్ పెన్షన్ విధానం నుండి యుపిఎస్ కి కాకుండా సి పి ఎస్ ని రద్దు చేసి నేరుగా పాత పెన్షన్ విధానమును అమలు చేయాలని ఉపాధ్యాయులు తహసిల్దార్ మహేష్ గౌడ్ కు వినతి పత్రం అందజేశారు ఉపాధ్యాయులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వము తమ ఉద్యోగులకు సిపిఎస్ విధానం నుండి వై దూలగించి ఓ పి ఎస్ విధానాన్ని తీసుకొని వస్తామని మాట ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిన రాజస్థాన్ చతిస్గడ్ జార్ఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దించారు కావున మన రాష్ట్రం ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఉద్యోగాలకు సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దించాలని మా శాఖ తరపున విన్నపం చేస్తున్నాము ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి సూర్య ప్రకాష్ జిల్లా మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి రాజు నాయక్ బస్వంత్ నాగేందర్ తిరుపతి రెడ్డి ఉపాధ్యాయులు పాల్గొన్నారు