Listen to this article

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్

జనం న్యూస్ 12 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

విజయనగరం జిల్లా గుర్ల పోలీసు స్టేషనులో 2022 సం.లో నమోదైన పోక్సో కేసులో నిందితుడు గుర్ల మండలం, పెనుబర్తి గ్రామానికి చెందిన గుడిశ సూర్యన్నారాయణ @ సూర్య (23 సం.లు) పోక్సో ప్రత్యేక న్యాయమూర్తి శ్రీమతి కే.నాగమణి గారు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు రూ. 3,000/-లు జరిమానా విధిస్తూ ఆగస్టు 11న తీర్పు వెల్లడించినట్లుగా విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.
వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం జిల్లా గుర్ల మండలంలో నివాసం ఉంటున్న 16 సంవత్సరాల మైనరు బాలికకు ఇంటర్ చదువుతూ, చదువుపై ఆసక్తి లేకపోవుట వలన ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా తల్లి ఇచ్చిన ఫిర్యాదుపై గర్ల్ మిస్సింగు కేసును గుర్ల పోలీసులు నమోదు చేసారు. అనంతరం, బాలిక ఆచూకీ లభ్యం కావడం, విచారణలో తనను నిందితుడు ప్రేమ పేరుతో లైంగిక వేధింపులకు గురి చేసి, అత్యాచారంకు పాల్పడినట్లుగా తెలపడంతో అప్పటి ఎస్సీ ఎస్టీ సెల్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు పోక్సో కేసుగా మార్పు చేసి, దర్యాప్తు చేపట్టినారు. అనంతరం, మహిళా పిఎస్ డిఎస్పీ టి.త్రినాధ్ కేసులో తదుపరి దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి, రిమాండుకు తరలించి, నిందితుడిపై అభియోగ పత్రం దాఖలు చేసారన్నారు.
ఈ కేసులో ప్రాసిక్యూషను పూర్తి అయ్యే విధంగా చీపురుపల్లి సిఐ శంకర్రావు, గుర్ల పోలీసు స్టేషన్ ఎస్ఐ2
పి.నారాయణరావు చర్యలు చేపట్టగా, నిందితుడు గుడిశ సూర్యనారాయణ అలియాస్ సూర్య (23 సం.లు) మైనరు బాలికపై అత్యాచారంకు పాల్పడినట్లుగా నేరం రుజువు కావడంతో విజయనగరం స్పెషల్ జడ్జి ఫర్ పోక్సో కోర్టు శ్రీమతి కె.నాగమణి గారు నిందితుడికి 20సంవత్సరాలు కఠిన కారాగారం మరియు రూ.3,000/-ల జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ కేసులో బాధితురాలికి రూ. 2 లక్షల పరిహారంను మంజూరు చేస్తూ పోక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పును వెల్లడించారు. ఈ కేసులో నిందితుడిపై నేరం నిరూపణ అయ్యే విధంగా పోలీసుల తరుపున ఫోక్సో కోర్టు ఇన్చార్జ్ పబ్లిక్ ప్రాసిక్యూటరు మెట్టా ఖజానారావు వాదనలు వినిపించగా, గుర్ల ఎస్ఐ పి.నారాయణ రావు, చీపురుపల్లి సిఐ శంకర్రావు పర్యవేక్షణలో ఎఎస్ఐ వై. రమణమ్మ, సి.ఎం.ఎస్. హెచ్ సి సిహెచ్. రామకృష్ణ సాక్షులను కోర్టులో హాజరు పర్చారన్నారు. ఈ కేసులో నిందితుడికి శిక్షపడే విధంగా పోలీసువారి తరుపున వాదనలు వినిపించి పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెట్టా ఖజానారావు, ఇతర అధికారులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.