

విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, ఐపిఎస్
జనం న్యూస్ 12 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
విజయనగరం జిల్లా 2వ పట్టణ పోలీసు స్టేషనులో 2024సం.లో నమోదైన గంజాయి కేసులో ఇద్దరు నిందితులకు 2సం.లు జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ. 10వేలు జరిమాన విధిస్తూ విజయనగరం 1వ ఎ.డి. జె. జడ్జి ఎం.మీనాదేవి గారు ఆగష్టు 11న తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు.వివరాల్లోకి వెళ్ళితే.. విజయనగరం 2వ పట్టణ పోలీసులుకు వచ్చిన నమ్మకమైన సమాచారం మేరకు తే. 25-08-2024 దిన విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలోని శ్రీనివాసనగర్లోని కోమటి చెరువు వద్దకు చేరుకోగా ఇద్దరు వ్యక్తులు (ఎ-1) విజయనగరం పట్టణానికి చెందిన ఉమ్మంది ఎల్లయ్య (26 సం.లు), (ఎ-2) విజయనగరం పట్టణానికి చెందిన బోని యూసఫ్ (25 సం.లు) పోలీసులను చూసి పారిపూవుటకు ప్రయత్నిచగా వారిని 2వ పట్టణ పోలీసులు పట్టుకొని వారి వద్దనుండి 3.1 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషన్ సిఐ టి.శ్రీనివాస రావు రిమాండుకు తరలించి, నిందితులపై అభియోగ పత్రం దాఖలు చేసారు. ప్రాసిక్యూషను సమయంలో నిందితులపై నేరారోపణలు రుజువుకావడంతో నిందితులు ఇద్దరికీ 2సం.లు జైలు, ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున జరిమానా విధిస్తూ విజయనగరం 1వ ఎ.డి. జె. జడ్జి ఎం.మీనాదేవి గారు తీర్పు వెల్లడించారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో పోలీసువారి తరుపున వాదనలను ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం. శైలజ, జి.సత్యం వినిపించగా, విజయనగరం 2వ పట్టణ సిఐ టి.శ్రీనివాస రావు, కోర్డు ఉమన్ కానిస్టేబులు టి.లక్ష్మి, సిఎంఎస్ కానిస్టేబులు కె.త్రినాధ రావు సాక్ష్యులను ప్రవేశ పెట్టడం, నిందితులకు శిక్షపడే విధంగా వ్యవహరించారని జిల్లా ఎస్పీ తెలిపారు. నిందితులకు శిక్షపడే విధంగా విధులు నిర్వహించిన పోలీసు అధికారులు, సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటరులను జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ అభినందించారు.