Listen to this article

జనం న్యూస్ 12 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

ఎస్ కోటలో ఉన్న ఎస్సీ బాయ్స్ హాస్టల్ లో భోజనం బాగోలేదని అడిగినందుకు హాస్టల్ విద్యార్థులపై సత్యనారాయణ గారు బెదిరింపు చర్యలు, తక్షణమే వార్డెన్ ను సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు, ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ గత కొంతకాలం నుంచి హాస్టల్లో భోజనం బాగోలేదని విద్యార్థులు సంఖ్యకు తగ్గట్టు భోజనం అన్నం కూర చాలీ చాలనట్టు పెట్టడం పెట్టిన భోజనంలో నాణ్యత లేకపోవడం వీటి వలన విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని పలుమార్లు చెప్పిన విన్నీ విన్నట్టు గా వ్యవహరించారు దీనిపై SFI నాయకులు స్పందిస్తూ వెంటనే ఇక్కడున్న హాస్టల్ వార్డెన్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు, అదేవిధంగా హాస్టల్లో ఆరోగ్యం బాగా లేకపోయినా పట్టించుకోవడం లేదని గది లో లైట్లు ఫ్యాన్లు లేకపోవడం వలన విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఉదయం నుండి టిఫిన్ మధ్యాహ్నం భోజనం తినకుండా నిరసన వ్యక్తం చేశారు వెంటనే విద్యార్థుల సమస్యను జిల్లా అధికారులు వచ్చి వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు,అదేవిధంగా హాస్టల్ వార్డెన్ సత్యనారాయణ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు మహేష్ చైతన్య తదితరులు పాల్గొన్నారు.