

జనం న్యూస్ ఆగష్టు 12 శాయంపేట మండలం రిపోర్టర్ మామిడి రవి శాయంపేట
మండలం తెలంగాణ ఉద్యమ కారులకిచ్చిన హామీలను వేంటనే నెరవేర్చాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు ఇమ్మిడిశెట్టి రవీందర్ అన్నారు సోమవారం రోజున హన్మకొండ జిల్లా అధ్యక్షుడు పోశెట్టి గణేష్ ఆధ్వర్యంలో వేయి స్తంభాల గుడి నుండి అమరవీరుల స్థూపం వరకు మహా పాదయాత్రలో మండలంలోని ఉద్యమకారులతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీలను వేంటనే నెరవేర్చాలని తెలిపారు లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం వేంటనే స్పందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ అధ్యక్షుడు కొమ్ముల శివ జిల్లా ఉపాధ్యక్షుడు గిద్దేమారి సురేష్ శాయంపేట టౌన్ అధ్యక్షుడు రంగు మహేందర్ తుమ్మ ప్రభాకర్ ఎం డి రఫీ కోలనందం తుడుం వెంకటేష్ నాగరాజు ఉప్పు రాజు మొత్తం 20 మంది కార్యకర్తలు పాల్గొన్నారు…..