Listen to this article

దాత కోడూరు కరుణాకర్ రెడ్డి

జనం న్యూస్, ఆగస్టు 12,( తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ ములుగు విజయ్ కుమార్)

సిద్దిపేట జిల్లా మర్కుకు మండల్ ఇప్పలగూడెం గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు దాత కోడూరు కరుణాకర్ రెడ్డి, పాఠశాల యూనిఫామ్ మరియు టై బెల్టులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ నేను చదువుకున్న పాఠశాలలోనే చదువుకుంటున్న విద్యార్థులకు తన వంతు సాయం చేయడం, ఎంతో సంతోషంగా ఉందని మరియు భవిష్యత్తులో పాఠశాల అభివృద్ధికి విద్యార్థుల అవసరాల నెరవేర్చడానికి కృషి చేస్తానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాఘవేందర్ గౌడ్, మరియు ఉపాధ్యాయులు కలిమ్ ఉల్లా, న్యాయవాది భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు