

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆగస్టు 12 రిపోర్టర్ సలికినీడి నాగు సెల్ 9550978955
ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు
చిలకలూరిపేట పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన హర్గర్ తిరంగా ర్యాలీలో మాజీ మంత్రి, స్థానిక శాసనసభ్యుడు పత్తిపాడు పుల్లారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూచంద్రబాబు ముందుచూపు కలిగిన నాయకుడని ఆయన అన్నారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళుతున్నారని ఆయన తెలిపారు. కనుకనే దేశం యావత్తు ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తుందని ఆయన పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షిస్తూ, ఏ ఒక్క రంగాన్ని విస్మరించకుండా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని ఆయన తెలిపారు. దేశంలో ఆంధ్రప్రదేశ్ ను రోల్ మోడల్ గా ఉంచాలని అన్ని వెనుకబడిన జిల్లాలకు సరైన ప్రాధాన్యం కల్పిస్తూ ముందుకు వెళ్తున్నారని ఆయన తెలిపారు. ఈ హార్ ఘర్ తిరంగ ర్యాలీ ద్వారా దేశ ఐక్యత నిరూపించవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.