Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 12 వికారాబాద్ జిల్లా.

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కెరవెళ్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో రెండవ విడత ఏకరూప దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంతోష్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం సకాలంలో రెండవ విడత ఏకరూప దుస్తులు పంపిణీ చెయ్యడం చాలా సంతోషకరము అని తెలిపారు. ఈ క్రమంలో AAPC చైర్మన్ లక్ష్మి , ఉపాధ్యాయులు లక్ష్మీనర్సిములు, పంచాయతీ సెక్రెటరీ మల్లేష్ , మహిళా సంఘం సభ్యులు అజ్జు బేగం, రైజా బేగం  పాల్గొన్నారు.