

బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చర్యలు
ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలి
ఎస్సై ప్రవీణ్ కుమార్
జనం న్యూస్ ఆగష్టు 13(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
మునగాల మండలంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావు ఉండదని ఎస్సై ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై మాట్లాడుతూ..మండల పరిధిలో అక్రమ వ్యాపారాలు,గుడుంబా తయారీ,ఇసుక అక్రమ రవాణా,జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ప్రజలు శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే సమాచారం అందించాలని కోరారు. మునగాల మండలంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం చేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ముఖ్యంగా వైన్ షాపుల సమీపంలో రోడ్లపైన బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని,ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తామని ఎస్సై హెచ్చరించారు.