

బంగారం దోచుకెళ్లిన దుండగులు
జనం న్యూస్ ఆగస్ట్ 12 హైదరాబాదు లోని చందానగర్ ఖజానా జ్యువెలర్ షాప్ లో ఉదయం దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఉదయం 10:30 గంటలకు షాపు తెరవగా షాపు తెరిచిన ఐదు నిమిషాలకు లోనే ఆరుగురు దుండగులు షాప్ లోకి చొరబడ్డారు. రెండు రౌండ్లు కాల్పులు జరిపి అసిస్టెంట్ మేనేజర్ సతీష్ పై కాల్పులు జరపగా కాలు లోకి బుల్లెట్ దిగింది. దాంతో షాపులో ఉన్న సిబ్బంది అంతా భయాందోళనకు గురై ఉరుకులు పరుగులు పెట్టారు. కాగా వచ్చిన దుండగులు బంగారం వెండి వస్తువులను దోచుకెళ్ళారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు అంతర్ జిల్లా సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. అసిస్టెంట్ మేనేజర్ సతీష్ ని ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.