

జనం న్యూస్,ఆగస్టు12,అచ్యుతాపురం:
అచ్యుతాపురం ఎంఎస్ఎంఈ భవనంలో పారిశ్రామికవేత్తలతో పి4 సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతథిగా హోం మంత్రి అనిత, స్థానిక ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్,అనకాపల్లి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ,అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్,పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా
హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ పేదరికం లేకుండా చేయడమే సీఎం చంద్రబాబు లక్ష్యమని, పేదరికం నిర్మూళనలో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం అవసరమని, ఎన్డియే ప్రభుత్వంలో పారిశ్రామీకవేత్తలు కూడా ఒక భాగమేనని, పరిశ్రమలకు ప్రభుత్వం అన్ని విధాలగా సహకరిస్తుందని,
గత ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలు అనేక ఇబ్బందులు పడ్డారని, పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే ఎన్నో త్యాగాలు చెయ్యాలని, పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలని,గత ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగాలు సకాలంలో జీతాలు ఇవ్వలేదని, ఎన్డియే ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నామని,ఆర్థిక ఇబ్బందులు ఉన్నా,అభివృద్ధి,సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని,ఎన్డియే ప్రభుత్వంలో అనేక భవనాలు నిర్మిస్తున్నామని అన్నారు.అలాగే ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మాట్లాడుతూ పేదరికం నిర్మూళలనలో ప్రతీ ఒక్కరి భాగస్వామ్యం అవసరమని,పరిశ్రమలకు ప్రభుత్వం
అన్ని విధాలగా సహకరిస్తుందని, రాష్ట్రంలో ఎలమంచిలి నియోజకవర్గం అభివృద్దిలో మొదటి స్థానంలో ఉండేలా మనందరం కలిసి స్నేహభావంతో పనీ చేయాలనీ కంపెనీ యాజమాన్యం సహకరించాలని విజ్ఞప్తి చేసారు. ఈ కార్యక్రమంలో అధికారులు,కంపెనీ యాజమాన్యం తదితరులు పాల్గొన్నారు.