Listen to this article

జనం న్యూస్ 13 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక

జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారి అదేశాలతో విజయనగరం పట్టణంలోని ఎం.ఎస్.ఎన్ జూనియర్ కళాశాలలో విద్యార్ధినీవిద్యార్థులకు శక్తి యాప్, గంజాయి, మత్తుపదార్ధాలు, ఈవ్జింగ్, పోక్సోచట్టాలు పట్ల ఆగష్టు 12న అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి మహిళా పిఎస్ డిఎస్పీ ఆర్.గోవిందరావు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మహిళా పిఎస్ డిఎస్పీ ఆర్.గోవిందరావు మాట్లాడుతూ – ప్రతీ విద్యార్థి తమ ఫోన్లో శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని, శక్తి యాప్ పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆపద సమయంలో శక్తి ఎస్.ఓ.ఎస్. కాల్ను ఉపయోగించి పోలీసుల సహాయం ఏ విధంగా పొందవచ్చునో వివరించారు. ఈవ్ టీజింగ్ వంటి సామాజిక దుష్ప్రవర్తనలు, దుష్పరిణామాలు, వాటికి చట్టపరమైన శిక్షలు గురించి, తీసుకొనే చర్యలు గురించి వివరించారు. మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడితే పోక్సో చట్టం ప్రకారం శిక్షలు తప్పవని డిఎస్పీ ఆర్.గోవిందరావు హెచ్చరించారు. యువత గంజాయి, ఇతర మత్తు, మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని జీవితాలను నాశనం చేసుకోవద్దని, చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలన్నారు. గంజాయి గురించిన సమాచారం ఏదైనా తెలిస్తే డయల్ 100/112 కు లేదా 1972 కు గాని వెంటనే తెలియజేయాలని విద్యార్థులను డిఎస్పీ కోరారు. విద్యార్థులు మంచి లక్ష్యాన్ని ఏర్పరచు కొని, లక్ష్యాన్ని చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. విద్యార్ధి దశలో చదువుపై దృష్టి పెట్టాలని, సోషల్ మీడియా ప్రభావానికి గురి కావద్దన్నారు.
ఈ అవగాహన కార్యక్రమంలో మహిళా పిఎస్ ఎస్ఐ జి .శిరీష, 1వ పట్టణ ఎస్.ఐ బి.దేవి, శక్తి టీం సిబ్బంది మరియు కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.