Listen to this article

పార్వతీపురం మన్యం జిల్లా ,

జనం న్యూస్ తేది ఆగస్టు 11, (రిపోర్టర్ ప్రభాకర్ ) :

ఆర్టీసీ స్థలాలను ప్రైవేటుపరం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 137 రద్దు చేయాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ జోనల్ కార్యదర్శి బాసూరు కృష్ణమూర్తి డిమాండ్ చేశారు. సోమవారం పార్వతిపురం మన్యం జిల్లా కేంద్రంలోని రెవెన్యూ భవన్లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్టీసీ ఆస్తులను ప్రైవేటు వ్యాపారస్తులకు దారా దత్తం చేయడం ఆ దిశగా ప్రభుత్వం జీవోలు విడుదల చేయడాన్ని ఆయన ఖండించారు. విజయవాడ నడిబొడ్డున ఉన్న ఏపీఎస్ఆర్టీసీ గవర్నర్పేట వన్ టు డిపోలు లులు మాల్ కి ఇవ్వడాన్ని ఆయన వ్యతిరేకించారు. 200 బస్సులు 1100 మంది ఉద్యోగులు ఉన్న డిపోలను ప్రైవేట్ సంస్థలకు ధారా దత్తం చేయడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశారు. ప్రభుత్వం విడుదల చేసిన 137 జీవోను వెంటనే నిలుపుదల చేయాలని లేని పక్షంలో ప్రజాసంఘాలు రాజకీయ పార్టీలతో కలిసి పోరాటం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షులు మరిపి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పైల సుందర్రావు జిల్లా ట్రెజరర్ దాసరి అపర్ణ, కమిటీ సభ్యులు బి ఆనంద్ పి జ్యోతి ఎంవీఎస్ నారాయణ పివి ఆచారి ఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.