

జనం న్యూస్ 13 ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి
భీమారం మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారి డివైడర్ సూచికల వద్ద గత కొద్ది రోజుల నుండి ఫ్లెక్సీ లలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఫోటో వేసుకొని నెలల తరబడి ఫ్లెక్సీలు అడ్డుగా ఉండి రోడ్డు దాటుట సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి, అధికారులకు ప్రజావాణిలో పలుమార్లు విన్నవించిన పట్టించుకున్న పాపాన పోలేదు, అధికారులు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఫ్లెక్సీలను తొలగించి ప్రజల ప్రాణాలను కాపాడుటకు అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని ప్రయాణికులు ఆరోపించారు, అభిమానం ఉంటే హృదయాలలో మంత్రి వివేక్ వెంకటస్వామిని భద్రపరుచుకోవాలి కానీ ఫ్లెక్సీలు పెట్టి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుట అవివేకం అన్నారు,