Listen to this article

తడ్కల్ లైన్మెన్ విష్ణు పాటిల్,

జనం న్యూస్,ఆగస్ట్ 13,కంగ్టి,

సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ పరిసరాల గ్రామాల ప్రజలకు లైన్మెన్ విష్ణు పాటిల్, బుధవారం వ్యవసాయదారులకు, ప్రజలకు,విద్యుత్తుకు సంబంధించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా లైన్మెన్ మాట్లాడుతూ భారీ వర్షాలు,గాలులు ఎక్కువగా వీస్తున్న నీటి నిలువ ఎక్కువగా ఉన్న చోట కరెంటు స్తంభాలను ముట్టుకోవద్దని అన్నారు.రైతులందరు తమ విద్యుత్ మోటార్ల దగ్గర,స్టార్టర్ల దగ్గర జాగ్రత్తలు పాటించాలని అన్నారు.వర్షం,గాలులు వచ్చే సమయంలో కరెంటు తీగల క్రింద, కరెంటు స్థంబాలు దగ్గర నిలబడి ఉండరాదని అన్నారు.ఎక్కడైనా కరెంటు లైన్లు తెగి పడిన చో,స్తంభాలు విరిగి పడినచో సంబంధిత లైన్ మెన్ కి,సంబంధిత సబ్ స్టేషన్ కి వెంటనే తెలియజేయాలని అన్నారు.భారీవర్షాల కారణంగా ఏర్పడు ఎటువంటి విద్యుత్ సమస్యలపైన మీ దగ్గరలోని సబ్ స్టేషన్ కు తెలియజేయాలని అన్నారు.