

జనంన్యూస్ జనవరి 27 ఎలిగేడు మండలం పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రానికి చెందిన సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సుధాకర్ వెంగీ కి మరియు నిర్మాత ఈశ్వర్ డైరెక్టర్ సురేష్ కు భరోసా స్వచ్చంద సేవా సంస్థ వ్యవస్థాపకుడు అధ్యక్షులు అక్కినపల్లి నాగరాజు ఆర్యవైశ్య సంఘం మండల ప్రధాన కార్యదర్శి తాటిపల్లి సతీష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు ఆదివారం రోజున జరిగిన ప్రసాద్ ఫిలిం ల్యాబ్ లో జనవరి 31 న విడుదల కానున్న. రాచరికం. సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పాల్గొని ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ పలు సీనిమాలలో మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసిన సుధాకర్ వెంగీ ఈ రాచరికం సినిమాలో ఎలిగేడు మండల కళాకారులకు అవకాశం కల్పించడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు ఈ రాచరికం సినిమాతో మంచి పేరు వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు ఈ కార్యక్రమంలో సినిమా హీరో విజయ్ శంకర్ హీరోయిన్ అప్సర రాణి నటుడు విజయరామరాజు జూనియర్ గాయకులు అక్కినపల్లి అభిరామ్ తదితరులు పాల్గొన్నారు