Listen to this article

ఎంపీ ధర్మపురి అరవింద్ హామీ.

జనంన్యూస్. 13. సిరికొండ.ప్రతినిధి.

నిజామాబాదు రూరల్ నియోజకవర్గం లోని సిరికొండ గ్రామంలో అంగడి బజారు రెండు ఎకరాల పైన ఉన్న మార్కెట్ కమిటీ ఖాళీ స్థలం ప్రస్తుతం వారానికి ఒక్కసారి మాత్రమే వినియోగంలో ఉంది.సరైన వసతులు, ముఖ్యంగా మార్కెట్ షెడ్డు ఏర్పడితే, ప్రతిరోజూ మార్కెట్ జరుగుతుంది. దీని వలన రైతులు, వ్యాపారులు, వినియోగదారులు అందరికీ సౌకర్యం లభించి, గ్రామ ఆర్థికాభివృద్ధి మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది అని స్థానిక బీజేపీ నాయకులు తెలిపారు. ఈరోజు సిరికొండ గ్రామ ప్రజల తరఫున ఈ విషయాన్ని ఎంపీ ధర్మపురి అరవింద్ దృష్టికి తీసుకెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించి షెడ్డు నిర్మాణానికి తగిన నిధులు అతి త్వరలో మంజూరు చేస్తాను” అని హామీ ఇచ్చారాణి తెలిపారు.ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ సిరికొండ గ్రామ నాయకులు ప్రధాన కార్యదర్శి ధర్పల్లి బాబురావు, కనగందుల గోపి, వావిలాల అజయ్, కామాని కిరణ్, బచ్చు మారుతి, గాంధారి రవి మరియు మండల అధ్యక్షుడు గుర్రం సంజీవరెడ్డి, ప్రధాన కార్యదర్శి మలోతు రాజేందర్ , బీజేవైఎం అధ్యక్షుడు పోతు గంటి మధు, నాయకులు ,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది..