Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 13 చిలిపి చెడు మండల ప్రతినిధి

మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో బుధవారం జరిగినటువంటి కార్యక్రమంలో భాగంగా

విద్యార్థులలో సృజనాత్మకత పెంచేందుకు టి ఎల్ ఎం

నేడు స్థానిక ఎం పి పి ఎస్ చిలిప్ చెడ్ పాఠశాలలో మండల స్థాయి ఎఫ్ ఎల్ ఎన్ టి ఎల్ ఎం మేళా మండల విద్యాధికారి విఠల్ గారి చేతుల మీదుగ ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో మండల విద్యాధికారి శ్రీ విఠల్ మాట్లాడుతూ విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేందుకు ఆసక్తిని రేకెత్తిస్తూ, వినూత్నంగా బోధించడానికి ఉపాధ్యాయులందరూ టి ఎల్ ఎం వాడాలని పి ఎల్ ఎం వాడకం వలన బోధన అర్థవంతంగా విద్యార్థి కేంద్రీకృతంగా ఉంటుందని తెలిపారుఈ కార్యక్రమంలో చిలిప్ చెడ్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ రమేష్ చండూర్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు శ్రీ విష్ణు మండల ఎం ఆర్ పి లు మరియు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు