

జనంన్యూస్. 13.సిరికొండ.ప్రతినిధి.
సిరికొండ మండలం లోని అర్హత కలిగిన కుటుంబాలు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద దరఖాస్తు చేసుకోవాలని సిరికొండ ఎండిఓ మనోహర్ రెడ్డి సూచించారు. అర్హత కలిగిన దరఖాస్తుదారులకు ఈ పథకం కింద రూ.20,000/- ఆర్థిక సహాయం అందజేయబడుతుందని ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబాలకు జాతీయ కుటుంబ ప్రయోజన పథకం (NFBS) వర్తిస్తుందని అన్నారు. ప్రాథమిక జీవనాధార వ్యక్తి మరణించినట్లయితే, అతని వయస్సు 18 ఏళ్లు పైబడి, 60 ఏళ్ల లోపు ఉండాలని. కుటుంబంలో మరణించిన వ్యక్తికి సంబంధించి మరణ ధ్రువపత్రం మరియు లబ్ధిదారుని ఆధార్ కార్డు. రేషన్ కార్డు. కుటుంబ సభ్యుల ధ్రువకరణ పత్రం. లబ్ధిదారుని యొక్క కులం మరియు ఆదాయం సర్టిఫికెట్. లబ్ధిదారు యొక్క బ్యాంకు పాస్ బుక్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు స్థానిక మీసేవ కేంద్రం లో అప్లై చేసుకోవాలని సూచించారు. లేదా తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
అర్హత కలిగిన కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందాలని ఎండిఓ తెలిపారు.