

పాల్గొన్న అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నందారం నరసింహ గౌడ్
జనం న్యూస్ ఆగస్టు 13 సంగారెడ్డి జిల్లా
పటాన్ చేరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని మాధవపురి హిల్స్ కాలనీలో గల శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయం ప్రథమ వార్షికోత్సవంలో అమీన్పూర్ మున్సిపల్ తాజా మాజీ వైస్ చైర్మన్ శ్రీ నందరం నరసింహా గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం స్థానికంగా నిర్వహించిన బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు శాలువాతో ఘనంగా సన్మానించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోచమ్మ తల్లి దయవల్ల తెలంగాణ ప్రజలందరు సుభిక్షంగా ఉండాలని ఆయన కోరుకున్నామన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ కౌన్సిలర్ మహదేవరెడ్డి, ఇంద్రేశం జ్ఞానేశ్వర్, ఆలయ నిర్వాహకులు, తదితరులు పాల్గొన్నారు.