Listen to this article

జనం న్యూస్ పల్నాడు జిల్లా చిలకలూరిపేట జనవరి 27 రిపోర్టర్ సలికినిడి నాగరాజు:- రైతులు వ్యవసాయంతో పాటు, అదనపు ఆదాయం కోసం పశుపెంపకంపై కూడా దృష్టి పెట్టాలని, పశుపోషణను ప్రోత్సహిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, సబ్సిడీలను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని మాజీమంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. ఏపీ పశుగణాభివృద్ధి మరియు పశుసంవర్థక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన మేలుజాతి లేగదూడల ప్రదర్శన కార్యక్రమం సోమవారం చిలకలూరిపేట రూరల్ మండలం మానుకొండవారిపాలెంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై లేగదూడల్ని, వాటికి అందిస్తున్న మందుల్ని పరిశీలించారు. అనంతరం స్థానికులు, రైతుల్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ పశువులు, గొర్రెలు, మేకలను పరిశీలించి వాటి అనారోగ్యానికి తగిన చికిత్సలు చేసి, మందుల్ని ఉచితంగా అందించే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, 20వ తేదీన మొదలైన ఈ కార్యక్రమం 31వరకు కొనసాగుతుందని, రైతుల తమ పశువుల రక్షణకోసం తమకు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పుల్లారావు సూచించారు. పాడిపరిశ్రమకు మానుకొండవారి పాలెం పెట్టింది పేరని, రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలు వ్యవసాయంలో, పాడిపోషణలో పోటీపడటం నిజంగా అభినందించాల్సిన విషయమన్నారు. ఎక్కువ పాలు ఇచ్చే హర్యానా జాతి గేదెల పెంపకంపై రైతులు దృష్టి పెట్టాలని పుల్లారావు సూచించారు. గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ల వంటి వాటి పెంపకానికి ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. తమ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలన్న గ్రామస్తుల విజ్ఞప్తిపై స్పందించిన పుల్లారావు, గ్రామస్తులంతా ఒకమాటపై ఉండి ఏకగ్రీవంగా తీర్మానం చేసి, రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను అందచేయాలన్నారు. కార్యక్రమంలో అధికారులు ఉపసంచలకులు పి. రామారావు, సహాయ సంచాలకులు టీ.శ్రీనివాసరావు, జి.రామ్మోహన్ రావు, శ్రీలత , జనసేన ఇంచార్జి తోట రాజా రమేష్, టీడీపీ నాయకులు జవ్వాజి మధన్ మోహన్, కల్లి వీరారెడ్డి, యస్.యస్. సుభని, టీడీపీ కరిముళ్లా, గట్టినేని రమేష్, అధికారులు డాక్టర్ లు తదితరులు పాల్గొన్నారు