Listen to this article

జనం న్యూస్ నందలూరు అన్నమయ్య జిల్లా.

అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యా సాగర్ నాయుడు ఐ పిఎస్ పర్యవేక్షణ లో రాజంపేట సబ్ డివిజన్ నందలూరు పోలీసు స్టేషన్ పరిధిలోని నందలూరు టౌన్ బ్రాహ్మణ వీధికి చెందిన పామూరి సాయి వర్ధన్, తండ్రి వెంకటేశ్వర్లు (వయసు 25 సంవత్సరములు)అను అతను తన భార్య అయిన పామూరి లక్ష్మీ ప్రసన్న (22 సం)ను అదనపు కట్నం కోసం వేధించడం తో భర్త వేధింపులు తాళలేక 29-04-23 వ తేదీన మధ్యాహ్నం సుమారు 12-30 గంటల సమయంలో లక్ష్మీ ప్రసన్న తన చున్నితో ఉరి వేసుకొని చనిపోయినట్లు మృతురాలి తండ్రి రావూరు కనకరత్న ఆచారి ఇచ్చిన పిర్యాదు మేరకు,అప్పటి నందలూరు ఏ. ఎస్. ఐ జే.వి.సుబ్బారాయుడు 29-04-2023 వ తేదీన నందలూరు PS Cr.No.79/2023,U/Sec 304(B)IPC ప్రకారం కేసు నమోదు చేశారు.అప్పటి రాజంపేట డి. ఎస్పీ జి.శివ భాస్కర్ రెడ్డి,మరియు వి. ఎన్.కే చైతన్య డి.ఎస్పీ, సాక్షులను విచారించి, సాక్ష్యాధారాలను సేకరించి,దర్యాప్తు చేసి సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించారు.సదరు నివేదికను రాజంపేట 3వ ఏ. డి.జె కోర్టు నందలూరు PS Cr.No.79/2023.Vide SC.N0.19/2024 U/Sec 304(B)IPC గా స్వీకరించి విచారణ జరిపి సదరు ముద్దాయికీ శిక్ష విధించారు.అన్ని కోణాల్లో విచారించిన రాజంపేట 3 వ ఏ. డి.జే కోర్టు జిల్లా అడి షనల్ న్యాయమూర్తి ఎస్.ప్రవీణ్ కుమార్ పైన తెలిపిన ముడ్డాయికి”10 సం”జైలు శిక్ష విధిస్తూ నేడు తీర్పు వెలువరించారు. ముద్ధాయికీ శిక్ష పడటంలో కృషి చేసిన ప్రస్తుత పబ్లిక్ ప్రాసిక్యూటర్ కే.వేణుగోపాల్ మరియు అప్పటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏర్. యం. డి జాని భాషా నీ అప్పటి దర్యాప్తు పోలీసు అధికారులను,సాక్షులను సమయానికి కోర్టు కు హాజరు పరిచేలా చేస్తూ కోర్టు ట్రయల్ నీ పర్యవేక్షిస్తున్న రాజంపేట రూరల్ సి.ఐ. బి.వి. రమణ,నందలూరు ఎస్.ఐ వి. మల్లికార్జున రెడ్డి నీ మరియు కోర్టు కానిస్టేబుల్ (పి. సి 1216) బి.వెంకటరమణ నాయక్ నీ అన్నమయ్య జిల్లా ఎస్పి విద్యాసాగర్ నాయుడు (ఐ పి. ఎస్) అభినందించారు