

- అధికారం ఉన్న లేకపోయినా నాకు అండగా బాసటగా నిలిచిన ప్రైవేట్ ఎలక్ట్రిషన్ సోదరులకు అభినందనలు.ఎలక్ట్రిషన్ డే శుభాకాంక్షలు.
- : ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య.
జనం న్యూస్,ఎన్టీఆర్ జిల్లా,నందిగామ, జనవరి 27 : నందిగామ పట్టణం నెహ్రు నగర్ నందు సోమవారం నాడు ప్రైవేట్ ఎలక్ట్రిషన్ కార్యాలయం నందు ఎలక్ట్రిషన్ డే వేడుకలలో కూటమినేతలతో కలిసి పాల్గొన్న ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాట్లాడుతూ ఆనాడు ప్రతిపక్షంలో మాకు బాసటగా అండగా నిలచి సహాయ సహకారాలు అందించిన ప్రైవేట్ ఎలక్ట్రిషన్ సోదరుల సేవలు మరువలేనివి ప్రత్యేకంగా ఆనాటి ప్రతిపక్ష నేత ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు నందిగామ విచ్చేసినప్పుడు ప్రైవేట్ ఎలక్ట్రిషన్ సోదరులు అందించిన సేవలు చిరస్మరణీయం. గత వైసిపి పాలనలో ఆ పాలకులు నిర్లక్ష్యంతో వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేసి చేసుకోవడానికి పనులు లేక పూట గడవని పరిస్థితి ప్రత్యక్షంగా చూశాము. గత ఐదేళ్ల పాలనలో అన్ని వ్యవస్థలను వాటి నిధులను దారి మళ్లించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారు. రాష్ట్రవ్యాప్తంగా గత ఐదేళ్ల కాలంలో ప్రజానీకం అనుభవించిన నరకయాతన నుంచి విముక్తి కొరకు ప్రతి ఒక్కరు కసిగా పనిచేసి ప్రజా ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. నాన్న హయాం నుంచి కూడా ప్రైవేట్ ఎలక్ట్రిషన్లు అంటే ఆయనకు మక్కువ ఎక్కువ మీ సమస్యలన్నింటిపై దృష్టి పెడతాను ప్రత్యేకంగా మీరు ప్రైవేట్ ఎలక్ట్రిషన్ భవనం కోరుకుంటున్నారు దీనిపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటానని తెలియజేశారు.