

జనం న్యూస్ జనవరి 28(రిపోర్టర్ నల్లబోతుల రాజు) అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వజ్రకరూరు మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హైస్కూల్ ఉన్నత పాఠశాల యందు చదువుతున్న స్కాట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత ప్రోత్సాహంతో అనంతపురం జిల్లా కేంద్రం పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జనవరి 26న జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచినారు, స్కాట్స్ అండ్ గైడ్స్ కెప్టెన్ గా ఉపాధ్యాయురాలు ప్రభావతి వ్యవహరించారు, ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గుర్తించి జిల్లా కలెక్టర్ డాక్టర్’వినోద్ కుమార్ ఐఏఎస్ చేతులమీదుగా ప్రశంస పత్రాలు అందజేశారు,ఇంత ప్రతిభా కనబరిచిన విద్యార్థులను మరియు కెప్టెన్ గా వ్యవహరించిన ఉపాధ్యాయురాలు ప్రభావతి ని, వజ్రకరూర్ సర్పంచ్ మోనాలిసా, పాఠశాల ప్రధానోపాధ్యాయులు స్వర్ణలత,ఉపాధ్యాయ బృందము అభినందనలు తెలిపారు, మునుముందు ఇలాంటి ఇంకా ఎక్కువ అవార్డులు వచ్చులాగున విద్యార్థులంతా కృషి చేయాలని తెలియజేశారు