Listen to this article

జనం న్యూస్. తర్లుపాడు మండలం. ఆగస్టు 14.

తర్లపాడు మండలంలోని గొల్లపల్లి మరియు రోలుగుంపాడు గ్రామాలలో మండల వ్యవసాయ అధికారి పి జోష్ణ దేవి నిర్వహించారు. వ్యవసాయ పథకాలు గురించి రైతులకు తెలియజేశారు. పీఎం ఎఫ్బి వై పంటల బీమా పథకము రేపటితో ముగుస్తుందని తెలియజేశారు. అర్హులైన రైతులు తప్పనిసరిగా పంటల బీమా చేయించుకోవాలని సూచించారు. అన్నదాత సుఖీభవ పథకంలో అర్హులై నగదు జమ కాని రైతులు రైతు సేవ కేంద్రం సిబ్బందిని సంప్రదించి వారి సమస్యను పరిష్కరించుకోవాలని తెలియజేశారు. ఖరీఫ్ ఈ పంట నమోదులో ప్రతి ఒక్క సర్వే నెంబర్ను రైతులు విధిగా నమోదు చేసుకోవాలని సూచించారు. గొల్లపల్లి గ్రామంలో సాగుచేసిన మెట్ట వరి పొలాలను వారు సందర్శించి రైతులతో మెట్ట వరి సాగు పద్ధతులపై చర్చించారు. మెట్టవరి సాగు అంటే నీరు నిలవని భూములలో వరిని సాగు చేసే పద్ధతి వెదజల్లే పద్ధతి లేదా డ్రై సీడింగ్ అని అంటారు. మెట్ట వరి సాగులో నీటి వినియోగం తక్కువగా ఉంటుందనీ , నారు పోయడం, నాటడం వంటి పనులు ఉండవు కాబట్టి సాగు ఖర్చులు తగ్గుతాయని తెలిపారు. అదేవిధంగా దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేశారు ఎందుకంటే విత్తనాలు నేరుగా భూమిలో నాటడం వలన మొక్కలు బలంగా పెరుగుతాయి. నారు పోసే సమయాన్ని ప్రధాన ఫలంలో మొక్కలు పెరగడానికి వీలుంటుందని త్వరగా కంకి వేయడానికి అవకాశం ఉంటుందని తెలియజేశారు. మెట్ట వరి సాగులో కలుపు సమస్యను అధిగమించడం వలన రైతులు అధిక దిగుబడులను సాధించవచ్చని తెలియజేశారు. కలుపు నివారణకు క్లించర్ 300 ఎంఎల్ లేదా నామిని గోల్డ్ ఎకరాకు 80 జి ఆర్ కలుపు మందులను వాడుకొని కలుపు సమస్యను నివారించుకోవాలని రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ దేవేందర్ గౌడ్, రైతు సేవ కేంద్రం సిబ్బంది గణేష్, గొల్లపల్లి మరియు రోలుగు0పాడు గ్రామ రైతులు పాల్గొన్నారు.