Listen to this article

వికారాబాద్ జిల్లా జనం న్యూస్ రిపోర్టర్ కావలి నర్సిములు.

జనం న్యూస్ ఆగస్టు 14 వికారాబాద్ జిల్లా.

వికారాబాద్ జిల్లాలో భారీ గా కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసినందున వికారాబాద్ జిల్లాలో అత్యంత భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
వాగులు, కాలువలు, నదులు, చెరువుల దగ్గరికి వెళ్లకండి. నీరు ఎక్కువగా ప్రవహిస్తున్న ప్రదేశాలకు వెళ్లరాదు. ప్రవహిస్తున్న రహదారులు, నాళాలు, వాగులు దాటరాదు. చెట్ల కింద & శిధిలావస్థలో ఉన్న భవనాల దగ్గర ఉండరాదు. రోడ్లు చిత్తడిగా ఉండవచ్చు వాహనాలు నెమ్మదిగా నడపండి, అవసరమైతేనే ప్రయాణించండి.అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలి. నీటి ప్రవాహాలను దాటే ప్రయత్నాలు చేయవద్దు. సెల్ఫీలు, రిల్స్ కోసం సాహసాలు చేయవద్దు. విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలను ఎట్టి పరిస్థితుల్లో ముట్టుకోవద్దు. చిన్న పిల్లలను ఇంట్లోనే ఉంచండి, బయటకు రానివ్వద్దు. మ్యాన్ హోల్స్ గుంతల పట్ల జాగ్రత్తగా ఉండండి. భారీ వానలు వరదల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు వెళ్ళకుండా తగు స్వీయ జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటున్నాను.