

జనం న్యూస్ ఆగస్టు 14:నిజామాబాద్ జిల్లా
ఏర్గట్ల మండలకేంద్రంలో గురువారం రోజునా ఏర్గట్ల టౌన్ లో ముఖ్యమంత్రి సహాయ నిధి 35000 రూపాయల చెక్కును గడ్డం అశోక్ కు పద్మశాలి సంఘ పెద్దమనుషులు కామని గణేష్,చుక్కోల్ల నరేష్ ఇంటికి వెళ్లి చెక్కు అందచేసారు. చెక్కును మంజూరు చేపించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమములో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్, దండేవోయిన ఆశన్న, సున్నపు శ్రీనివాస్, ఎస్కే రషీద్, దండేవోయిన సాయి, జంగాల గణేష్ , తునికి గంగాధర్, జంగాల పెద్దోళ్ల శ్రీనివాస్, పడిగెల గంగాధర్, ఎస్కే సలీం, మదస్తూ చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు.