

జనం న్యూస్, ఆగష్టు 14, జగిత్యాల
జిల్లా, కోరుట్ల నియోజకవర్గం: ఈరోజు కోరుట్ల పట్టణంలోని వర్తక సంఘం సభ్యులు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావుని కలిసి వారి సమస్యల గురించి వివరించడం జరిగింది, వారి సమస్యల గురించి క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపిస్తానని సానుకూలంగా స్పందించరు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు, అనంతరం వర్తక సంఘ సభ్యులు నరసింగరావుని శాలువాతోఘనంగా సన్మానించారు, ఈ కార్యక్రమంలో కోరుట్ల వర్తక సంఘ సభ్యులు పాల్గొన్నారు