Listen to this article

జనం న్యూస్ పార్వతీపురం మన్యం జిల్లా ఆగస్టు 14 రిపోర్టర్ ప్రభాకర్

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో అన్ని వసతులు పూర్తిస్థాయి సౌకర్యాలు ఆధునికరణమైన మిషనరీతో కూడిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రోగులకు అందుబాటులోకి రానుందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. గురువారం పార్వతీపురం మన్యం జిల్లా ప్రాంతీయ హాస్పిటల్ ను ఎమ్మెల్యే విజయచంద్ర ఆకస్మికంగా పరిశీలించారు. ముందుగా ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. రోగులకు అందుతున్న వైద్యసేవలపై రోగుల బంధువులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. రోగులను లిఫ్ట్ పై సక్రమంగా తీసుకెళ్లడం లేదని, మెట్ల పైనుంచి నడిచి వెళ్లాల్సి వస్తుందని కొంతమంది చెప్పడంతో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. లిఫ్ట్ సక్రమంగా పనిచేయకపోవడంతో ఆస్పత్రి ఎలక్ట్రిషన్ ను పిలిపించి ఆయనను ప్రశ్నించారు. ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు సమాధానం సక్రంగా చెప్పకపోవడంతో ఆయనపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ఈ ఆసుపత్రిని నేను నాలుగైదు సార్లు పరిశీలించానని, రోగులను లిఫ్ట్లో ఎక్కించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, లిఫ్ట్ రిపేర్ జరిగితే బాగు చేయాల్సిన బాధ్యత ఎలక్ట్రిషన్ కు ఉందని, ఇంత నిర్లక్ష్యం వహించడం ఎంతవరకు సమంజసమని, ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. రోగుల పట్ల నిర్లక్ష్య వహించిన ఈ ఎలక్ట్రిషన్ ను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను సూచించారు. రోగులపట్ల వైద్యులు గాని, వైద్య సిబ్బంది గాని, మరే ఇతర సిబ్బంది గానీ నిర్లక్ష్యం ఇస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాకు, నియోజవర్గానికి ముఖ్యంగా రెండు ప్రధాన అవసరాలు ఉన్నాయని, ఒకటి విద్య, రెండు వైద్యం, ఈ రెండింటి పైన కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుందన్నారు. పార్వతిపురం ప్రాంతీయ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స నుండి సర్జరీ వరకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని, దీనికి సంబంధించి ఇప్పటికే వైద్యుల పనితీరు, సిబ్బంది పనితీరుపై ప్రత్యేకమైన పరిశీలన జరుగుతుందన్నారు. ఇందులో భాగంగానే ఈరోజు ఈ ఆసుపత్రి పరిశీలన చేయడం జరిగిందన్నారు. రోగులపట్ల వైద్యులు గాని, వైద్య సిబ్బంది గాని ఎటువంటి నిర్లక్ష్యం వహించిన శాఖా పరమైన చర్యలు తప్పని హెచ్చరించారు. ఎలాంటి ఎమర్జెన్సీ రోగులను కూడా పార్వతీపురం నుంచి విజయనగరం, విశాఖపట్నం ఆసుపత్రులకు రిఫరల్ చేయకుండా అన్ని రకాల వైద్య సదుపాయాలు, చికిత్సలు చేయడం కోసమే ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం జరుగుతుందన్నారు. నూతన భవనం అన్ని ఆధునీకరణ వసతులతో నిర్మించడం జరుగుతుందని, పాత భవనం చిన్న చిన్న వైద్య సదుపాయాల కోసం వాడటం జరుగుతుందని అన్నారు. త్వరలోనే మల్టీస్పెషల్టి హాస్పిటల్ అందుబాటులోకి రానునదన్నారు. ఎమ్మెల్యేతో పాటు మన్యం జిల్లా ప్రాంతీయ ఆసుపత్రి వైద్య అధికారులు, సిబ్బంది, టిడిపి నాయకులు ఉన్నారు.