Listen to this article

డోంగ్లి ఆగస్టు 14 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోంగ్లి మండలంలోని గురువారం రోజున మల్లాపూర్ లో గ్రామ పంచాయతీ భూమి పూజ కాంగ్రెస్ నాయకులు చేశారు. అలాగే వాళ్ళు మాట్లాడుతూ గత ప్రభుత్వం పదేళ్లు పరిపాలించిన గ్రామ పంచాయతీ భవనం సాంక్షన్ కాకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు మా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారి ఆదేశాలతో 20 లక్షలతో మల్లాపూర్ గ్రామానికి గ్రామపంచాయతీ భవనం ఇవ్వడంతో ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏఎంసి వైస్ చైర్మన్ పరమేష్ పటేల్, ఉమాకాంత్ పట్టీల్, లక్ష్మణ్ పటేల్ ,దీన్ దయాల్, విలాస్, సంగ్రామ్ పటేల్, సెక్రెటరీ ప్రమోద్, శెట్టేవర్ రాజు, సంతోష్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు amc డైరెక్టర్ రామ్ గొండ, ex సర్పంచ్ వీరేష్ గొండ, యూవ నాయకుడు అమృత్వర్ శ్రీకాంత్, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.