Listen to this article

జనంన్యూస్ ఆగస్టు 14:నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల

మండలం:స్థానిక తహసీల్దార్ మల్లయ్య మాట్లాడుతూబంగాళాఖాతం లో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసినందున రాబోయే 4 రోజులలో అత్యంత భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఉన్నందున ప్రజల సౌకర్యార్ధం తాహసీల్దార్ కార్యాలయములో ఇరవై నాలుగు గంటలు అందుబాటులోఉండేవిధంగా కంట్రోల్ రూముఏర్పాటు చేయనైనది కావున మండలములోని ప్రజలు వర్షాల సమయములో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగినా సమాచారము ఈ క్రింద చూపిన ఫోన్ నెంబర్ లకు ఫోన్ చెసినచో అధికారులు వెంటనే స్పందించి ప్రజలకు కావలసిన రక్షణ చర్యలు ప్రభుత్వము తరపున వెంటనే చేపట్టి ప్రజలకు ప్రాణ నష్టము, ఆస్తుల నష్టము, చెరువులు, కుంటలకు నష్టము, పంట పొలాలకు నష్టము, రైతులకు కరెంటు వలన ప్రమాదములు జరిగే సూచన ఉన్నది. మేము వెంటనే స్పందించి చర్యలు చేపట్టుటకు అవకాశము ఉంటుంది కావున కంట్రోల్ రూము ఫోన్ నెంబర్ లు తహసీల్దార్, ఏం డి ఓ, ఎస్ ఐ 8331853219,8919709260, 8712659869 లకు ఫోన్ చేయవలసిందిగా కోరారు.