Listen to this article

డోంట్లీ ఆగస్టు 14 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం డోన్లి మండలంలోని లింబూర్ గ్రామపంచాయతీ పరిధిలో వాడి గ్రామానికి తాసిల్దార్ ప్రవీణ్ కుమార్ ఆర్ ఐ సాయిబాబా ట్రాక్టర్ పైన వర్షంలో ఆ గ్రామాన్ని కి వెళ్లారు. లింబూర్ గ్రామానికి వాడి గ్రామానికి మధ్య వాగు ఉంది వాగు పైన వంతెన లేకపోవడం భారీ వర్షాలకు వాగు పొంగి పొర్లుతుంది వరదలు వస్తే వాడి గ్రామానికి రాకపోకలు నిలిచిపోతాయి గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణం కేంద్రం సూచించింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా వర్షాల మూలంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి రాష్ట్ర ప్రభుత్వము నుండి రావడం డోంగ్లి మండల తాసిల్దార్ ఆర్ఐ కలిసి లింబూర్ గ్రామం నుండి ట్రాక్టర్ పైన వాడి గ్రామ వాగులో నుండి వెళ్లి ఆ గ్రామాన్ని సందర్శించారు కురుస్తున్న వర్షంలోనే గ్రామస్తులతో మాట్లాడుతూ మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున వాడి గ్రామానికి మధ్యలో వాగు ఉన్నందున మీరు ఎక్కడికి వెళ్లకూడదని తెలిపారు మూడు రోజులకు కావలసిన వస్తువులు కొనుగోలు చేసుకోవాలని సూచించారు కిరాణా సామాగ్రి గాని కూరగాయలు గాని ఇతర వస్తువులు ముందుగానే తెచ్చుకోవాలని సూచించారు ఆరోగ్యశాఖ నుండి తగిన విధంగా ముందు జాగ్రత్త కొన్ని టాబ్లెట్లు అందించే చర్యలు చేపట్టారు వాడి గ్రామానికి మధ్యలో వాగు ఉన్నందున ఈ గ్రామ ప్రజలకు కొన్ని సంవత్సరాల కాలంగా వర్షాకాలంలో నానా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తున్న వాటి గురించి తాసిల్దార్ బాన్స్వాడ సబ్ కలెక్టర్ వర్షంలోనే మాట్లాడుతూ వివరించారు సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామ ప్రజలకు అన్ని రకాలుగా అవగాహన కల్పిస్తూ భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకొని అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని అధికారులు తమకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు వర్షంలో నడవడం రాని పరిస్థితుల్లో డాక్టర్ పైన వాలి గ్రామానికి వచ్చి తాసిల్దారుకు ఆర్ఐకి గ్రామస్తులంతా అభినందనలు తెలుపుతూ మా గోధు చూడండి సార్ మాకు రోడ్డు వేయించండి వాగు పైన వంతెన నిర్మించండి అంటూ వేడుకున్నారు