Listen to this article

జనం న్యూస్ ఆగష్టు 15(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రేపాల పరిధిలోని కలకోవ గ్రామంలో వైద్యాధికారి వినయ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ వర్షాల కారణంగా వైద్య సిబ్బంది ముందస్తు గా జ్వర పీడీతులను గుర్తించేందుకు ఇంటింటి సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఇద్దరికి డెంగ్యూ జ్వరం రాగా వారిని జిల్లా గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. డిప్యూటీ డీ ఎం హెచ్ ఓ డాక్టర్ జయ మనోహరీ గురువారం జ్యరపీడుతుల గృహాలను సందర్శించి జాగ్రత్తలు చెప్పారు..సాధారణ జ్వరాలు తొమ్మిది మంది కి వచ్చాయి మాత్రలు పంపిణీ చేసి జాగ్రత్తలు చెప్పారు. మరియు డ్రై డే, చేసి దోమ లార్వాలను తొలగించారు. గ్రామపంచాయతీ సిబ్బందితో బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరిగింది.అలాగే దోమల నివారణకు టెమీపాస్, ఫాగింగ్ స్ప్రేయింగ్, పైరేత్రం ద్వారా శానిటేషన్ చేశారు.ప్రతి ఒక్కరూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు.పూల కుండీలు , డ్రమ్ము లు, టైర్లు, కొబ్బరి బొండాలు, చెత్తను తొలగించాలి..గాబులలో నీటి నిల్వలు లేకుండా వారానికి ఒక్క సారి శుభ్రపరచుకొని దోమల వ్యాప్తిని నీవారించాలని తెలిపారు..
దోమ తెరలువాడాలి,సాయంత్రం 6గంటలకు దోమలు ఇంట్లోకి రాకుండా తలుపులు కిటికీలు వేసుకోవాలి అని తెలిపారు..డెంగ్యూ మలేరియా చికెన్ గున్యా బోధకాలు వ్యాధుల నుండి విముక్తి పొందాలనీ తెలియజేశారు.. డిప్యూటీ డీ ఎం హెచ్ ఓ జయ మనోహరి ఫీవర్ సర్వేను,వైద్య శిబిరాన్ని పరిశీలించి,జ్వరపీడితుల ను పరామర్శించి జాగ్రత్తలు చెప్పారు…వీరితో ఎన్ సి డి. ప్రోగ్రాం ఆఫీసర్ ఆశ్రిత ఉన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రమేష్ దీన్ దయాల్, హెల్త్ సూపర్వైజర్ జయమ్మ, ఏం పి ఓ నరేష్, డివిజన్ మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ సముద్రాల సురేందర్,ఆశ వర్కర్లు, హెల్త్ అసిస్టెంట్ లింగం రామక్రిష్ణ ,ఏఎన్ఎంలు నాగమణి, నరసమ్మ, పద్మ ,శాంతమ్మ,,గ్రామపంచాయతీ కార్యదర్శి సైదులు, ఆశ వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.