

జనం న్యూస్. తర్లుపాడు మండలం ఆగస్టు 14
స్థానిక వెలుగు కార్యాలయంలో మహిళా సంఘాలకు కూరగాయ విత్తనాల ప్యాకెట్లు ఈరోజు ఎమ్మార్వో కె. కిషోర్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ ప్యాకెట్‌లో 11 రకాల కూరగాయ విత్తనాలు ఉన్నాయని, వీటి మార్కెట్ ధర ₹100 కంటే ఎక్కువైనా మహిళా గ్రూపులకు కేవలం ₹65కే అందజేస్తున్నట్లు ఏపీఎం రమేష్ తెలిపారు. మహిళలు వీటిని పెరట్లో నాటుకుంటే తాజా కూరగాయలు లభించి ఆరోగ్యకరమైన జీవనానికి దోహదం అవుతుందని ఆయన చెప్పారు.కార్యక్రమంలో సీసీ సూరభయ్య వీఆర్వో సర్వేయర్, వీఓఏ మహిళా గ్రూపు సభ్యులు పాల్గొన్నారు.