Listen to this article

జనం న్యూస్ 27 జనవరి కోటబొమ్మాళి మండలం: మండలం కొత్తపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలకు ఆదే పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న షణ్ముఖ మాస్టర్‌ రూ. 21వేలు విలువ చేసే అహుజా కంపెనీ కి చెందిన 55 వాట్స్‌ కలిగిన సౌండ్‌ సిస్టమ్‌, మూడు మైకులు సోమవారం వితరణ అందజేశారు. గత ఏడాది కూడా ఆరువేల రూపాయలు విలువ చేసే పోర్టబుల్‌ వైట్‌ బోర్డు మరియు స్టాండ్‌లు అందజేసారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు గోవిందరావు అన్నారు. పాఠశాలకు, విద్యార్ధులకు ఎంతో అవసరమైన ఈ వస్తువులు బహుకరించడంతో ఆయనకు గ్రామస్తులు, సహ ఉపాధ్యాయులు, విద్యార్ధుల తల్లిదండ్రులు, విద్యార్ధులు ధన్యవాదాలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సింహాచలం, సంతోష్‌ , ఎస్‌ఎంసీ చైర్మన్‌ అల్లాడ రుక్మిణి, తదితరులు పాల్గొన్నారు.