

* మంద కృష్ణ మాదిగ అడుగుజాడల్లో ముందుకు
* ఊరూవాడా ‘దండోరా
* అలుపెరగనిఎమ్మార్పీఎస్ ప్రస్థానం
జనం న్యూస్- జనవరి 27- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్:- ఫిబ్రవరి 7వ తారీఖున హైదరాబాదు నడిబొడ్డున లక్ష డప్పులు వేల గొంతుకల నినాదంతో ఏ బి సి డి వర్గీకరణ సాధనకై మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టిన మంద కృష్ణ మాదిగ కి స్వాగతం పలికేందుకు, జనాల్ని మమేకం చేసేందుకు, ఇవాళ లక్ష డప్పులు వెయ్యి గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం రోజు నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ లో అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు .డబ్బులకు, డప్పులకు జరుగుతున్న పోరులో తాడోపేడో తేల్చుకునేందుకే ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ వెయ్యి గొంతులు, లక్ష డప్పుల కార్యక్రమాన్ని ఫిబ్రవరి 7న ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మార్పీఎస్ కార్యకర్తపై ఉందని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఆదాస్ విక్రమ్ మాదిగ అన్నారు, ఈ కార్యక్రమానికి మందకృష్ణ మాదిగ అతిథిగా పాల్గొంటారని ఆయన అన్నారు. ఈ బాధ్యత మన అందరి పైన ఉందని అన్నారు. ఒక వర్గం నుండి మరో వర్గానికి జరుగుతున్న పోరులో తమ సత్తాను చాటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు గ్రామ గ్రామాలలో మాదిగలను చైతన్యవంతం చేయాలని సూచించారు. లక్ష డప్పులు, వెయ్యి గొంతుల కార్యక్రమానికి ప్రతి ఒక భుజానికి ఒక డప్పు సంకన వేసుకొని సమావేశానికి హాజరై విజయవంతం చేయాలన్నారు. ఫిబ్రవరి 7న ఏర్పాటుచేసి హైదరాబాద్ తరలించే విధంగా చూడాలని అన్నారు. ఇంటికొక్క డప్పు తీసుకొని యువకులను కదిలించే బాధ్యతలో సైతం నాయకులు చోరువ తీసుకోవాలని సూచించారు. మాదిగ మాదిగ ఉపకాలాలను సైతం కదిలించే విధంగా ముఖ్య నాయకులు ప్రత్యేక, కార్యాచరణ రూపొందించుకోవాల్సిన
అవసరం ఉందని బాధ్యతలు తీసుకొని ఉప కులాలను సైతం బలోపేతం చేసే విధంగా కృషి చేయాలని అన్నారు. మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాలు కష్టపడ్డాడు మనమందరం కష్టపడి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వామ్యం కావాలని కార్యకర్తలను కోరారు. ఈ కార్యక్రమంలో చిత్రం, శ్యాము మాదిగ, పెరిక శ్రీను మాదిగ, మంద కిషోర్, గణేష్, వెంకటేష్, రమణ, గోపాల దావీదు,కృష్ణ కుమార్, పెంచలయ్య, వెంకటేశ్వర్లు, నాగేందర్, వెంకటి, తదితరులు పాల్గొన్నారు.