Listen to this article

జనం న్యూస్- ఆగస్టు 15- నాగార్జునసాగర్ టౌన్ రిపోర్టర్ విజయ్-

ముస్లిం మైనారిటీ ఎంప్లాయిస్ అసోసియేషన్ భవన్ లొ 79 వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ముస్లిం మైనార్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సయ్యద్ మెహబూబ్ జానీ జాతీయ జెండా ఆవిష్కరణ చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎందరో మహానుభావుల త్యాగ ఫలితంగా మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సభ్యులు ఫిరోజ్, ఇబ్రహీం, రషీద్, అబ్దుల్, వహీద్, షఫీ, గౌస్, రఫీ, నజీర్, గని, సాదిక్, జిలాని తదితరులు పాల్గొన్నారు.