

జనం న్యూస్ 15 ఆగష్టు, విజయనగరం టౌన్ రిపోర్టర్ గోపికృష్ణ పట్నాయక
79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం ఉదయం అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ వ్యవస్థాపకధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) 42వ డివిజన్,అయ్యన్నపేట జంక్షన్ వద్ద గల మున్సిపల్ కార్పొరేషన్ నడకమైదానంలో మువ్వన్నెల పతాక ఆవిష్కరణ నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ డి.వి.జి. శంకరరావు విచ్చేసి జండా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతోమంది మహనీయుల ప్రాణత్యాగాల ఫలితమే మనం ప్రస్తుతం సుభవిస్తున్న ఈస్వతంత్రమని, ఆ త్యాగ జీవులను ప్రతీ ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు.ప్రముఖ సంఘసేవకులు, సింహాగిరి విద్యాసంస్థల అధినేత సింహాగిరి పట్నాయక్ మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశం అన్నిరంగాల్లోను ముందుండడం గర్వించదగ్గ విషయమని, కులమతాలకు అతీతంగా మన భారతీయులు జరుపుకునే పండుగ స్వాతంత్ర్య దినోత్సవమని ఇటువంటి వేడుకలను మన వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీమని క్లబ్ సభ్యులను కొనియాడారు.అనంతరం ముఖ్య అతిధులైన డాక్టర్ డి.వి.జి. శంకరరావును, సింహాగిరి పట్నాయక్ ను, కోట్ల సత్యనారాయణ ను క్లబ్ సభ్యులు సత్కరించారు.
ఈ కార్యక్రమంలో వాకర్స్ క్లబ్ గౌరవ పెద్దలు కోట్ల ఈశ్వరరావు,పైడయ్య,పెనుమత్స అప్పలరాజు, పాత్రుడు, సత్యారావు, రాంబాబు, పైడిరాజు, శేఖర్, శ్రీను, భారీగా పెద్దలు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.