

జనం న్యూస్ ఆగష్టు 16(మునగాల మండల ప్రతినిధి కందిబండ హరీష్)-
ఢిల్లీలో జరిగిన 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొన్న మునగాల మండల కేంద్రానికి చెందిన వల్లోజు అశ్విత్ తేజ. దేశవ్యాప్తంగా రక్షణశాఖ క్విజ్ పోటీలు నిర్వహించగా 2 లక్షల మంది విద్యార్థులు పాల్గొన్నారు.వీరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కోదాడ తేజ విద్యాలయ విద్యార్థి వల్లోజు అశ్విత్ తేజకు అరుదైన గౌరవం లభించింది.దేశ రాజధాని ఢిల్లీలో నీ ఎర్రకోటలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఆవిష్కరణ మరియు నరేంద్ర మోడీ ప్రసంగాన్ని దగ్గరగా వీక్షించిన వల్లోజు అశ్విత్ తేజ కు తేజ విద్యాలయ పాఠశాల ఉపాధ్యాయులు శుభాకాంక్షలు తెలిపారు.