Listen to this article

జనం న్యూస్ ఆగస్టు 15 వికారాబాద్ జిల్లా

వికారాబాద్ జిల్లా పరిగి మండలం లో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా శిక్షణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సయ్యద్ మల్కాపూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఎఫ్ ఎల్ ఎన్ పుస్తకాలను ప్రధాన ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి చేతుల మీదుగా అందించడం జరిగింది. శిక్షణ ఫౌండేషన్ మెంటర్ రమేష్ మాట్లాడుతూ తేజస్ నెట్వర్క్ దాతల సహకారంతో పరిగి మండలంలోని 50 ప్రభుత్వ పాఠశాలలో శిక్షణ ఫౌండేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పడం జరిగింది. విద్యార్థులలో భాషా గణిత సామర్ధ్యాలను పెంపొందించడంలో ఈ పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయని విద్యార్థులు ఈ పుస్తకాలను ఉపయోగించుకోవాలని తెలియడం జరిగింది. ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రాధా స్వప్న దీపిక పద్మ గ్రామ పెద్దలు యువకులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. విద్యార్థులకు ఎఫ్ ఎల్ ఎన్ పుస్తకాలను శిక్షణ ఫౌండేషన్ వారు అందించినందుకు వారికి గ్రామ పెద్దలు ఉపాధ్యాయులు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పడం జరిగింది.