

జనం న్యూస్ 27 జనవరి కోటబొమ్మాళి మండలం: మండలం మాసాహెబ్‌పేట పంచాయతీ కమలనాభపురం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న సుమారు 100 మంది విద్యార్ధులకు సోమవారం ఆ పంచాయతీ సర్పంచ్, మాజీ రాష్ట్ర కళింగకర్పోరేషన్ డైరెక్టర్ సంపతిరావు హేమసుందరరావు ధనలక్ష్మిలు పెన్నులు, నోట్ పుస్తకాలు, పెన్సిల్‌ను పంపిణీ చేశారు. విద్యార్ధులు బాగా చదువుకొని మన గ్రామానికి, తల్లిదండ్రులకు పేరును తీసుకుకావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రదానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్ధులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.