

జనం న్యూస్ ఆగస్టు 15 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ
ది 15-08-2025 న నడవపల్లి పంచాయతీ కార్యాలయం నందు 79వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలు సర్పంచ్ అధ్యక్షతన వైభవం గా జరిగినది. ముందుగా సర్పంచ్ శ్రీమతి దొమ్మటి పల్లవి జండా ఎగరవేసినారు. జండా వందనం అనంతరం పంచాయతీ సెక్రటరీ ఏ సురేష్ మాట్లాడుతూ గ్రామం పరిశుభ్రత, ప్లాస్టిక్ నివారణకు చర్యలు తీసుకోవాలని చెప్పారు.విద్యార్థులకు పెన్నలు పంపిణి చేసినారు, ఈ కార్యక్రమంలో పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ ఏ భారతి ,ముఖ్య అధితులు గా గ్రామ టీడీపీ ప్రెసిడెంట్ గువ్వాల సత్తిబాబు పంచాయతీ ఐదో వార్డ్ నెంబర్ గ్రంధి నానాజీ,( డా. బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా , బిజెపి ట్రెజరర్ ).
గ్రామ కమిటీ సెక్రటరీ పెమ్మాడి నాగమల్లేశ్వరరావు బూత్ ఇన్చార్జిలు మట్టపర్తి సాయి గుత్తులసూరిబాబు యూనిట్ ఇంచార్జ్ పాకలపాటి త్రినాధ్ వర్మ గ్రామ కమిటీ సభ్యులు పోలవరపు వెంకటరమణ మోటిపల్లి నాని అల్లూరి సోమరాజు గారు గెద్దాట సోమేశ్ డివివి సత్యనారాయణ పంచాయితీ సిబ్బంది సచివాలయం సిబ్బంది అంగన్వాడి సిబ్బంది ఆశా వర్కర్లు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

