

జనం న్యూస్ ఆగష్టు 15 జగిత్యాల జిల్లా
బీరుపూర్ మండలంలోని కండ్లపెళ్లి తుంగూర్ గ్రామాల మధ్యలో వాగు వాగు పేరు (పెద్దవాగు) ప్రవసిస్తుంది ఆ వాగు పైనుంచి పోవడానికి గతంలో బ్రిడ్జ్ కట్టారు ఆ బ్రిడ్జ్ పక్కన నుండి గత మూడు సంవత్సరాల క్రితం నీళ్లు ప్రవసించగా మట్టి కొట్టుకపోయింది అప్పటి మందము మీద మీద మట్టి పోయించారు ఆ మట్టి బలంగా లేనందున మళ్లీ కూలిపోయింది నేను గంగాధరి అంజన్న కండ్లపెల్లి గ్రామానికి చెందిన వాడిని నేను ఆటోను నడుపుకుంటూ జీవిస్తున్నాను రోజుకు మూడు నాలుగు సార్లు తుంగూరు నుండి రంగసాగర్ కి ఆటో తోలుతూ ఉంటాను నాతో పాటు ఇంకా కొందరు ఆటో మీదనే ఆధారపడి బ్రతుకుతున్నాము మధ్యలో పెద్ద వాగు వద్ద రావడానికి పోవడానికి ఇబ్బందిగా ఉన్నది ఈ విషయం గతంలో కండ పెళ్లి పంచాయతీ సెక్రెటరీ మరియు తాజా మాజీ సర్పంచ్ దృష్టికి తెలియజేశాను మరియు కొంతమంది రాజకీయ నాయకులకు కూడా తెలియజేశాను ఎవరు పట్టించుకోలేదు ఈరోజు నేను స్వయంగా ఆ బ్రిడ్జి వద్దకు వెళ్లి ఆ బ్రిడ్జి పక్కన కొట్టుకుపోయిన మట్టి ప్రక్కన బెటు బండలు పెట్టి తట్టాపారతో మట్టిని గట్టిగా కూదబెట్టాను ముందు ఆటో పోవడానికి ఇబ్బందిగా ఉండే ఇప్పుడు బడి బస్సు కానీ లారీలు ఏదైనా పోయే విధంగా తాత్కాలికంగా సారి చేశాను దయచేసి నేను తెలియజేసేది ఏమనగా ఈ సమస్య ఇక్కడితో ముగిసిపోలేది కాదు మళ్లీ వర్షం పడితే పెట్టిన బండలు కూడా కిందికి జారి మళ్లీ రోడ్డు కూలిపోయే అవకాశం ఉన్నది కావున అధికారులు స్పందించి ఈ యొక్క బ్రిడ్జిని శాశ్వతమైన పరిష్కారం చేయగలరని నాయొక్క మనవి
