Listen to this article

జనంన్యూస్.జనవరి.27.నిజామాబాదు. ప్రతినిధి. నిజామాబాద్ సిరికొండ మండల కేంద్రంలోని పంది మడుగు. గ్రామంలో నేడుజాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలలో భాగంగా సోమవారం రోజునవాహనదారులకు అవగాహన కల్పించిన సిరికొండ ఎస్సై ఎల్ రాము. ఈ సందర్భంగా ఎస్సై ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని వాహనాలకు సంబంధించిన ఆర్ సి ఇన్సూరెన్స్ లైఫ్ టాక్సీ లైసెన్స్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పకుండా ధరించాలని అలాగే ఫోర్ వీల్ డ్రైవింగ్ చేసేటప్పుడు తప్పకుండా సీటు బెల్టు పెట్టుకోవాలని తెలిపారు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా అధికారులు ఆపి తనిఖీ చేసినప్పుడు తన ధ్రువపత్రాలు చూపించాలని అలాగే వారికి సహకరించాలని ఈ సందర్భంగా ఎస్ఐ ఎల్ రాము తెలిపారు.