

జనం న్యూస్ ఆగస్టు 16 చిలిపి చెడు మండల ప్రతినిధి
మెదక్ జిల్లా చిలిపి చెడు మండలంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు మరియు రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి నుండి మోసర్ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు తప్పక పాటించాల్సిన వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వరి పత్తి వంటి పంట పొలాల నుండి నీరు నిలిచి ఉన్నట్లయితే త్వరగా బయటకు పంపేందుకు మురుగనీటి కాలువలను ఏర్పాటు చేయాలి ఎరువుల వాడకం పై పాటుగా వేసే ఎరువులు మరియు పురుగుమందుల పిచికారిని తాత్కాలికంగా నిలిపివేయాలి పంటల వారీగా సూచనలు వరి నీటిలో మునిగిన పొలాల నుండి నీటిని త్వరగా బయటకు పంపాలి నాట్లు వేయని రైతులు వర్షాలు తగ్గిన తర్వాత నాట్లు వేయడానికి సిద్ధం కావాలి సమయం తక్కువగా ఉన్నట్లయితే వెదజల్లే పద్ధతిలో విత్తనాలు వేయాలి కలుపు నివారణ చర్యలు తీసుకోవాలి పంట త్వరగా కోలుకోవడానికి లీటరు నీటికి ఐదు గ్రాముల చొప్పున 19 19 19 ద్రావణాన్ని లేదా రెండు మిల్లి లీటర్ల చొప్పున నానో యూరియా లేదా నానో డి ఏ పి నీ పిచికారి చేయాలి పత్తి అధిక వర్షాలు కారణంగా వడలు తెగులు ఆశించే అవకాశం ఉంది దీని నివారణకు లీటర్ నీటికి మూడు గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ కలిపి మొక్కల మొదల్లో తడిచే విధంగా పిచికారి చేయాలి దీనిని వారంలో రెండు సార్లు చేయాలి పంట త్వరగా కోలుకోవడానికి లీటర్ నీటికి 5 నుండి 10 గ్రాములు మల్టీకే లేదా 10 గ్రాముల యూరియా లేదా రెండు మిల్లీ లీటర్ల నానో యూరియాను పిచికారి చేయాలి మొక్కజొన్న పొలంలో నీరు నిలిచి ఉన్నట్లయితే వెంటనే బయటకు పంపే ప్రయత్నం చేయాలి బాస్వరం లోపల నివారణకు లీడర్ నేటికీ రెండు మిల్లీ లీటర్ల నానో డి ఏపీ లేదా ఐదు గ్రాముల 19 19 19 పోషకాన్ని పిచికారి చేయాలి వర్షాలు తగ్గిన తర్వాత పొలంలో అంతర కృషి చేయడం వల్ల కలుపు మొక్కలను తొలగించడంతోపాటుగా పొలంలో అధిక తేమను తగ్గించుకోవచ్చు ఈ కార్యక్రమంలో ఎం ఏ ఓ రాజశేఖర్ గౌడ్, రైతులు గోపాల్ రాజు రమేష్ నామ్యా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు