

(జనం న్యూస్ 16 ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి )
భీమారంమండలం, బూరుగుపల్లి గ్రామపంచాయతీ నుండి గేర్రెగూడెం మీదుగా దాంపూర్ వరకు రోడ్డు నిర్మాణ పనులను 14 మే నెలలో చెన్నూర్ నియోజకవర్గం కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి మూడు కోట్ల 35 లక్షల సి ఆర్ ఆర్ నిధులతో పిడబ్ల్యుడి రోడ్డుకు శంకుస్థాపన చేసి ఆరు నెలలు గడిచినరోడ్డు పనులను పూర్తి చేయకపోవడంతో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్డు అడ్డంగా తెగిపోవడంతో అక్కడ ఉన్న పంట పొలాలు నష్టం వేటిల్లింది, రోడ్డుకుశంకుస్థాపన చేసి రోడ్డు పనులు పూర్తి చేస్తే వరద కొట్టు రాకుండా ఉండేది, రోడ్డు పనులు సకాలంలో పూర్తి చేస్తారని నమ్మకంతో పంట పొలాల వేసుకుంటే మాకు నష్టం వచ్చేది కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు
