

మద్నూర్ ఆగస్టు 16 జనం న్యూస్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం లో శుక్రవారం రాత్రి నుండి శనివారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు చిన్న ఎక్లారా గ్రామం గుండ వెళ్తున్న కాలువ పొంగి పొర్లింది. రోడ్డు మధ్యలో ఉన్న పైపులలో భారీ వర్షాలకు పైనుండి కొట్టుకు వచ్చిన చెత్త, విరిగిన చెట్ల కొమ్మలు పైపుల మధ్యలో తట్టుకోవడం వలన నీటి ప్రవాహం వెనకకు తన్ని గ్రామంలోకి నీళ్ళు వచ్చాయి అని మద్నూర్ మండల తహసీల్దార్ ఎం డి ముజీబ్ సబ్ కలెక్టర్ కిరణ్మయి గారికి వివరించారు. వెంటనే జేసీబీ, గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా పైపు లలో తట్టిన చెత్త, చెట్ల కొమ్మలను తొలగించి నీరు సాఫీగా వెళ్ళే విధంగా చేసినట్లు చూయించారు. అదేవిధంగా వెనక్కి తన్నిన నీరు అంత దిగువకు వెళ్ళిపోయిన తీరును పరిశీలించారు. ఇంకా 24 గంటలు ప్రజలు, అధికారులు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని, అత్యవసరం అయితేనే బయటికి రావడం, ప్రయాణాలు చేయాలని లేనట్లయితే వాయిదా వేసుకోవాలని తెలిపారు.
సబ్ కలెక్టర్ గారి వెంట మండల బిచ్కుంద సర్కిల్ ఇన్స్పెక్టర్ (C.I) రవికుమార్ తహసీల్దార్ ఎం డి ముజీబ్ ఎంపీడీఓ రాణి, ఎస్సై విజయ్ కొండ, గిర్దవార్ ఏం శంకర్,

