

మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్య రాజ్ కుమార్
(జనం న్యూస్ 16 ఆగస్టు ప్రతినిధి కాసిపేట రవి)
భీమారం మండలం బూరుగుపల్లి నుండి నరసింగాపూర్ రహదారి పైన వరద ప్రవహించే క్రమంలో అన్ని గ్రామలా ప్రయాణికులు ఎన్నో సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతూనే ఉన్నారు శనివారం కురిసిన భారీ వర్షానికి రాకపోకలకు వాహనాలు రోడ్డు దిగ్బంధం అయినాయి, స్థానిక చెన్నూరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ భూక్య రాజ్ కుమార్ మాట్లాడుతూ ఈ వాగు పైన ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి ఇలాంటి సంఘటన జరగకుండా చెన్నూరు నియోజకవర్గం మంత్రి వివేక్ వెంకటస్వామి గ్రహించి అధికారులని పంపించి బ్రిడ్జి నిర్మాణం తక్షణమే చేపియాలని కోరారు, ఈ కార్యక్రమం లో పిఏ సిఎస్ డైరెక్టర్ పానుగంటి లక్ష్మణ్ భూమేష్, పల్ల మహేష్ మరియు ప్రజలు యువత పాలుగోన్నారు