

జనం న్యూస్ ఆగస్టు 16 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ కాట్రేనికోన, :
సుధీర్ విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తే ఎల్లప్పుడూ గుర్తింపు ఉంటుందని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్సీ ఎస్టీ కమీషన్ విజిలెన్స్,మానటరింగ్ కమిటీ డైరెక్టర్ వెంట్రు పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్,జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు చేతుల మీదగా ఉత్తమ పోలీస్ అవార్డు అందుకున్న కాట్రేనికోన సబ్ ఇన్ స్పెక్టర్ అవినాష్ కలిసి శాలువతో సత్కరించి అభినందించారు ఈ కార్యక్రమంలో దొంతికుర్రు తెలుగుదేశం పార్టీ నాయకులు, సీనియర్ న్యాయవాది మోర్త గాంధీ బాబు, టీడీపీ మహిళా విభాగం నాయకురాలు సాపే రూప తదితరులు పాల్గొన్నారు
