Listen to this article

మద్నూర్ ఆగస్టు16 జనం న్యూస్

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం మద్నూర్ మండలం గొజ్జేగావ్ గ్రామ సమీపంలో ఉన్న లేండి వాగును రెవిన్యూ అధికారులు పోలీస్ అధికారులు పరిశీలించారు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షానికి ఉధృతంగా ప్రవహిస్తున్న సమాచారం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన వాగు వద్దకు వచ్చారు నీటి ప్రవాహం తగ్గడంతో రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు తెలియజేశారు వరద ఉధృతి ఎప్పుడైనా రావచ్చు అని గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రవహిస్తున్న వాగు నుంచి ఎవరు కూడా దాటే ప్రయత్నం చేయవద్దని గ్రామస్తులకు వారు సూచించారు అధికారులు తాసిల్దార్ ముజీబ్ బిచ్కుంద సీఐ రవికుమార్ మద్నూర్ ఎస్సై విజయ్ కొండ మండల గిద్ద వారి ఎం శంకర్ గ్రామపంచాయతీ కార్యదర్శి సిబ్బంది పాల్గొన్నారు